Tuesday, November 13, 2018

ఓ నాలుగు మంచి మాటలు

👌👌👌👌👌👌👌👌👌👌👌
    *ఓ నాలుగు మంచి* మాటలు*
👌👌👌👌👌👌👌👌👌👌👌

*ఒకరిని బాధపెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు. కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకరావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధపెట్టకుండా ఉందాం.*
🌸🌸🌸🌸🌸🌸🌸

*"మౌనం" - "మనస్సు"ని  శుద్ధి చేస్తుంది.
"స్నానం" "దేహాన్ని" శుద్ధి చేస్తుంది.
"ధ్యానం" - "బుద్ది"ని శుద్ధి చేస్తుంది.
"ప్రార్థన"- "ఆత్మ"ను శుద్ధి చేస్తుంది.*

  *"దానం" - "సంపాదన"ను శుద్ధి చేస్తుంది. "ఉపవాసం"- "ఆరోగ్యాన్నీ" శుద్ది చేస్తుంది. అలాగే "క్షమాపణ" - "సంబంధాల"ను శుద్ది చేస్తుంది.*
🌺🌺🌺🌺🌺🌺🌺

*ఎవరితో అయినా సరే ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉండాలి. అందరూ మనవాళ్ళే అని వాళ్ళమంచి కోసం ఏదైనా మంచి మాట చెబితే వాళ్ళ దృష్టిలో మనం చెడ్డ వాళ్ళం అవుతాం జాగ్రత్త.*
💐💐💐💐💐💐💐

*నీ గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు వందమంది గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి.*
🌷🌷🌷🌷🌷🌷🌷

*సత్యం వైపు నీవుండాలనుకుంటే ఒంటరిగా మహా వృక్షంలా నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవాల్సివస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి.*
🌻🌻🌻🌻🌻🌻🌻

*జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చాలానే చూడాల్సివస్తుంది. వాటన్నింటినీ ఎదుర్కొనే "ధైర్యం" ఉన్నప్పుడే జీవితం అర్ధవంతంగా ఉంటుంది. ఏ క్షణంలో అయితే మన పట్ల మనం నమ్మకాన్ని కోల్పోతామో ఆ క్షణం నుండే మనం చచ్చిన శవంతో సమానం.*
🌼🌼🌼🌼🌼🌼🌼

*కరుగుతున్న కాలానికీ, జరుగుతున్న సమయానికీ, అంతరించే వయసుకీ మిగలిపోయే జ్ఞాపకమే - "మంచితనం". అదే మనకు "ఆభరణం"...*
🌹🌹🌹🌹🌹🌹🌹

*"అదృష్టం" అంటే ధనం వస్తువులు ఉండడము కాదు,*
      -   చేతినిండా పని ...
      -   కడుపునిండా తిండి..
      -   కంటినిండా నిద్ర...
      -   అవసరానికి ఆదుకునే ఆప్తులను కలిగి ఉండడమే అసలైన "అదృష్టం".*
🥀🥀🥀🥀🥀🥀🥀

*మనల్ని అర్ధం చేసుకుంటే గుండెల్లో గుడి కట్టినా తప్పులేదు. కానీ మనకే విలువ లేనిచోట ఎదుటి వ్యక్తి గురించి ఎంత ఆలోచించినా వ్యర్ధమే.*
🌳🌳🌳🌳🌳🌳🌳

*మనిషిలో "అహం" తగ్గిన రోజు "ఆప్యాయత" అంటే అర్ధం అవుతుంది. "గర్వం" పోయిన రోజు ఎదుటివారిని ఎలా "గౌరవించాలో" తెలుస్తుంది. "నేనే", "నాకేంటి !" అనుకుంటే చివరకు ఒక్కడిగానే ఉండాల్సివస్తుంది. "గౌరవమర్యాదలు" ఇచ్చిపుచ్చుకుంటూ అందరితో కలిసి ఆనందంగా జీవించడమే "మంచి జీవితం".*
🌴🌴🌴🌴🌴🌴🌴

*నిరంతరం వెలిగే సూర్యూణ్ణి చూసి "చీకటి" భయపడుతుంది. అలాగే నిత్యం కష్టపడే మనిషిని చూసి "ఓటమి" భయపడుతుంది.*
🌲🌲🌲🌲🌲🌲🌲

*ఇతరులు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకు. నీకంటూ ఒక "విలువ" ఉందని తెలుసుకో. అలాగే నీకన్నా తక్కువ స్థాయి వారిని చూసి ఆనందపడకు. పై స్థాయి వారిని  చూసి లక్ష్యమేర్పరచుకో.*
🌱🌱🌱🌱🌱🌱🌱

*నీవు ఈ ప్రపంచానికి అర్ధం కాకపోయినా బ్రతికేయవచ్చు. కానీ నీకు నువ్వే అర్ధం కాకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు.*
🌿🌿🌿🌿🌿🌿🌿

*జీవితంలో "సంపాదన" పెరిగితే ధనవంతుడివి అవుతావు. "వయస్సు" పెరిగితే ముసలివాడివి అవుతావు. కానీ నీలో "మంచితనం" పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం మిగులుతావు.*
🤘🤘🤘🤘🤘🤘🤘

No comments:

Post a Comment